
అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని కన్నాపూర్ తండాకు చెందిన నాన్గోత్ గంగి (49), చిన్న కుమారుడు విదేశాలకు బతుకుదెరువు కోసం అప్పుచేసి 4 సార్లు వెళ్లి, తిరిగి రావడంతో, అప్పులు పెరిగి దాదాపు రూ 5 లక్షలకు చేరడంతో మనస్థాపం చెంది సోమవారం సాయంత్రం క్రిమిసంహారక మందు సేవించి అపస్మారక స్థితిలో ఉండటంతో, కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు గమనించి కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 2 గంటలకు మృతిచెందినట్లు భర్త బావ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ రవీందర్ తెలిపారు.