అనారోగ్య సమస్యలతో మహిళ ఆత్మహత్య.. 

నవతెలంగాణ -దుబ్బాక : అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దుబ్బాక మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం జరిగింది.ఎస్ఐ వీ.గంగరాజు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన అబ్బత్తిని విమల (63) కొడుకు రాజేష్,కోడలితో కలిసి జీవనం కొనసాగిస్తోంది.అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవలే 4 సర్జరీలు జరిగినప్పటికీ.. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో మానసికంగా కృంగిపోయింది.గతంలో రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు కాపాడారు.అనారోగ్య సమస్యలు ఎంతకీ తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లోని దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.ఉదయం గమనించిన కుమారుడు స్థానికులకు,పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు పంచనామ నిర్వహించి, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఏరియా వంద పడకల ఆసుపత్రికి తరలించారు.మృతురాలి కుమారుడు రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.