జీవితంపై విరక్తి చెంది మహిళా ఆత్మహత్య..

నవతెలంగాణ- రామారెడ్డి : జీవితంపై విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రానికి చెందిన బండి లక్ష్మి (47) గతంలో కుమారుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా, కూతురు విడాకులు కావడంతో ఇంట్లో ఉండటం, కుటుంబ పరిస్థితులపై మానసికంగా రోజు కుంగిపోయేదని, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంట్లో నుండి వెళ్లి, తిరిగి రాకపోవడంతో బంధువుల ఇండ్లలో, చుట్టుపక్కల వేతుకుంతుండగా శనివారం గ్రామ శివారులోని పటేల్ చెరువులో మృతదేహం కనిపించించిదని , భర్త బండి చిన్న లింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ సుభాషిని తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.