– వీడియో వైరల్
లక్నో : బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ కార్యక్రమంలో ఒక మహిళ అశ్లీల డ్యాన్స్ చేసింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ, గ్రామపెద్ద వేదిక వద్ద ఉండగానే ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కేంద్ర పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ పేరుతో కార్యక్రమాలను బీజేపీ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా శనివారం భోజ్‌పూర్ ప్రాంతంలోని షకుర్‌పూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పెద్ద, ఆయన భార్య, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ తదితరులు హాజరయ్యారు.