నవతెలంగాణ-కాసిపేట
మండలంలోని స్టేషన్ పెద్దనపల్లికి చెంది ముక్కెర రోషిణి(24) మృతి చెందినట్లు కాసిపేట ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని స్టేషన్ పెద్దనపల్లిలో ముక్కర రోషిని తన భర్త వెంకటేష్‌తో మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అప్పుడప్పుడు భార్య భర్తల మధ్య గొడవలు జరిగితే పెద్ద మనుషుల సమక్షంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచిగా ఉండాలని పలు మార్లు పంచాయతీలు జరిగాయి. గురువారం నుంచి జ్వరం రాగా శుక్రవారం ఆమె భర్త ఆమెని బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ ఫిట్స్ రావడంతో మెరుగైన చికిత్స కొరకు రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఏరియా హాస్పిటల్‌కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. తన కుమార్తె ముక్కెర రోషిని మృతిపై అనుమానం ఉందని రోహిణి తండ్రి పిట్టల తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.