నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
ద్విచక్ర వాహనంపై వెళుతున్న బానోతు కౌసల్య వయసు (40) బీహార్ రాష్ట్రం నుంచి బతుకుదెరువు కోసం చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం ఉంటున్నారు. ప్రమాదవశాత్తు శుక్రవారం రాత్రి మృతి చెందింది. శనివారం ఎస్.లింగోటం నుంచి మల్కాపురం గ్రామానికి వెళ్తుండగా బొర్రలగూడెం స్టేజీ వద్దకు రాత్రి 9:10 గంటలకు తల్లి ప్రమాదవశాత్తు టీవీఎస్ ఎక్స్‌ఎల్ బైక్‌పై నుంచి కిందపడిపోయింది. ఆ సమయంలో వెనుకవైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహనం ఆమెపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.కూతురు బానోతు జానకి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.