రేబిస్‌ వ్యాక్సిన్‌ వికటించి మహిళ మృతి

నవతెలంగాణ-భూపాలపల్లి టౌన్‌
రేబిస్‌ వ్యాక్సిన్‌ వికటించి మహిళ మృతిచెందిన సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఆస్పత్రిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని మంజూర్‌నగర్‌కు చెందిన మహిళ రజిత(37)కు నెల రోజుల కిందట కుక్క కరవడంతో జిల్లాకేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి వైద్యం కోసం వెళ్ళింది. నిబంధనలు పాటించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో రజితకు ఫ్రిజ్‌లో పెట్టని రేబిస్‌ ఇంజక్షన్‌ వేయడంతో వికటించింది. ఆమె శరీర అవయవాలు పూర్తిగా దెబ్బతినడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. ఆమె మృతితో రజిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.