సీసీ రోడ్డు వివాదంలో మహిళ మృతి

మృతి– మా స్థలం నుంచి సీసీ రోడ్డు వేయొద్దని మహిళ ఆందోళన
– మూడు రోజులుగా వార్డు సభ్యుడు, మహిళ మధ్య ఘర్షణ
– కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ
నవతెలంగాణ-షాద్‌నగర్‌
సీసీ రోడ్డు వివాదంలో మహిళ మృతి చెందిన ఘటన ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని మొగిలిగిద్ద గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మొగిలిగిద్ద గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (54) అనే మహిళ ఇంటి ముందు సీసీ రోడ్డు వేస్తామని వార్డు సభ్యుడు తబ్రేజ్‌ చెప్పడంతో నా సొంత ఇంటి స్థలంలో వేయరాదని మతురాలు వాగ్వివాదానికి దిగింది. మూడు రోజుల నుండి ఇద్దరి మధ్యన ఘర్షణ జరగడంతో తబ్రేజ్‌ వార్డు సభ్యుడు మేము తప్పకుండా రోడ్డు వేస్తామని చెప్పడంతో మనస్తాపానికి గురైన లక్ష్మమ్మ మంగళవారం సాయంత్రం ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పు అంటించుకుంది. దాంతో తీవ్రంగా గాయపడిన మహిళను షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. మతురాలికి భర్త ఇద్దరు కుమారులు ఉన్నారు.మతురాలి కుమారుడి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు.