రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో బడుగు ఇందిరా (43) జ్వరంతో బాధాపడుతూ మృతి చెందింది. గత వారం రోజుల నుండి జ్వరంరాగా వేములవాడ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రక్త కణాలు తక్కువ ఉన్నాయని, వెంటనే కరీంనగర్ తీసుకు వెళ్ళమని డాక్టర్లు సూచించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. మృతురాలికి భర్త భూమయ్య, కూతుళ్లు స్వేత, వైష్ణవి, కొడుకు రాహుల్ ఉన్నారు. మృతరాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.