రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి చేపట్టిన ఇందిరా మహిళ శక్తి క్యాంటిన్ నిర్వహణ శ్రీకారం చుట్టింది.శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ శిక్షణ పూర్తి చేసిన కల్లేపల్లి గ్రామానికి చెందిన బిగుళ్ల వెంకటలక్ష్మికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శిక్షణ దృవీకరణ పత్రం అందజేశారు.మండల నాయకులు పాల్గొన్నారు.