నవతెలంగాణ-కుభీర్: ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కింద పడి మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన కుభీర్ మండలంలోని డోడర్న్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది .స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం డోడర్న్ గ్రామంలో బస్సు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు వేనికి టైరు కింద పడడంతో కాలికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్యం బైంసా ఏరియా ఆస్పత్రి కి తరలించినట్లు స్థానికులు తెలిపారు.