గుర్రాల సరోజినమ్మకు ఉమెన్ అచీవర్స్ అవార్డు – 2024

నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ బోధన్ డివిజన్ గౌరవాధ్యక్షురాలు గుర్రాల సరోజినమ్మకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉమెన్ అచీవర్స్  అవార్డును లక్ష రూపాయల ను బహుకరించింది. మంత్రివర్యులు  సీతక్క చేతుల మీదుగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఈ అవార్డు లక్ష రూపాయల చెక్కు రవీంద్ర భారతిలో నిర్వహించిన మహిళా దినోత్సవం ఉత్సవాలలో బహుకరించారు. గత అనేక సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. అనాధ శవాల అంత్యక్రియలకు, అద్దె ఇళ్లలో నివసించే వారి బంధువులు చనిపోయినట్లయితే అంత్యక్రియల జరిపించుకోవడానికి ఆశ్రమాన్ని కల్పించే ధర్మస్థలిని వారు నిర్మించారు. తాను నివసిస్తున్న భవనాన్ని తన తనంతరం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ &రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్కు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు బహుకరించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే వారికి నిరుద్యోగులకు పుస్తకాలను బహుకరించారు. పేద పిల్లలకు ఫీజులు కట్టడం వైద్య సహాయాన్ని అందించటం మల్లు స్వరాజ్యం ట్రస్టుకు జనరిక్ మెడికల్ హాల్ కొరకు రెండున్నర లక్షలు వితరణ. కంద కుర్తి నందు ఆవులకు ఆశ్రయాన్ని కల్పించే విధంగా షెడ్డులను నిర్మించారు. ఈ విధంగా 84 సంవత్సరాల వయస్సులోనూ ఈ విధంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఉమెన్స్ అచివర్స్ అవార్డును లక్ష రూపాయలతో బహూకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కే రామ్మోహన్రావు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సరోజినమ్మ కి అభినందనలు తెలిపారు.