కోతుల దాడిలో మహిళలకు గాయాలు

నవతెలంగాణ-చేగుంట
చేగుంట మండల కేంద్రంలో కోతుల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాటికి బయట ఆహారం దొరకకపోవ డంతో ఏకంగా ఇళ్లల్లోకి వెళ్లి దాడులు చేస్తున్నాయి. అలాగే చేగుంట పట్టణ కేంద్రంలో మంగళవారం ఉదయం కోతులు మహిళలపై దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన పేర్ల పోచమ్మ, ఇంట్లో పనులు చేసుకుంటుండగా ఇంట్లోకి చొర బడి ఆ వద్ధురాలిపై దాడి చేసి గాయపరిచాయి. అలా ఒక్కరోజే 15 మంది వ్యక్తులపై కోతులు దాడి చేసి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. స్థానికులు, మహిళలు కోతుల వల్ల నిత్యం నరకం అనుభవిస్తున్నామని, అలాగే నిత్యం పాఠశాలకు వెళ్లే విద్యార్థుల టిఫిన్‌ బాక్స్‌లపై, వ్యాపారస్తుల దుకాణాలు, పళ్ళ దుకాణాలు, తాళాలు వేసిన ఇంటికి చిన్న వెంటిలేటర్‌లో నుంచి ఇంట్లోకి వెళ్లి నిత్యవసర సరుకులతో పాటు, అన్ని చిందరవందర చేసి, వాటికి ఎదురు తిరిగితే దాడి చేస్తున్నాయి. వేలకు వేల రూపాయల సరుకులతో పాటు, ఇతర సామాన్లు కూడా ధ్వంసం అవుతున్నాయని వాపోతున్నారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎవ్వరు పట్టిం చుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకుని కోతులను పట్టించి వేరే దూర ప్రాంతాలకు వదిలిపెట్టేలా చూడాలని చేగుంట పట్టణ ప్రజలు అధికారులను ప్రజా ప్రతినిధులను వేడుకుంటున్నారు. ఇదిలాఉంటే కోతులు దాడి చేసి గాయపరిచిన వారి కుటుంబ సభ్యులు గ్రామ సర్పంచ్‌ను ఆశ్రయించారు. కోతులు గాయపరిచిన, ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయాన్ని తనతో విన్నవించగా, త్వరలో వాటిని పట్టి దూర ప్రాంతాలకు తరలించే విధంగా కషి చేస్తానని సర్పంచి తెలిపారు.