– ఫిర్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
– బాధ్యతగా వ్యవహరించాలి
– మహిళా పోలీస్ అధికారులకు శిక్షణ
– ఎంసీ డబ్ల్యూ చైర్ పర్సన్ రేేఖా శర్మ
నవతెలంగాణ-గండిపేట్
మహిళా చట్టాల పట్ల మహిళా పోలీస్ ఉన్నత అధికారులు పకడ్బందీగా చర్యలు అమలు చేయాలని ఎంసీ డబ్ల్యూ చైర్ పర్సన్ రేఖా శర్మ అన్నారు. మంగళవారం గండిపేట్ మండలం తెలంగాణ పోలీస్ అకాడమీలో రెండు రోజుల పాటు మహిళా పోలీస్ ఉన్నత అధికారులకు మహిళా కొత్త చట్టాలపైన వర్క్‌షాప్ నిర్వ హించారు. కార్యక్రమానికి ముఖ్యులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులతో పోలీసుల పరస్పర చర్యలు ప్రజల జీవితాలు తీవ్ర ప్రభావితం చేస్తాయన్నారు. మహిళా చట్టాలను అమలు చేసేందుకు లింగ వివక్ష సునీతత్వాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్లాన్నారు. మహిళా సమస్యల పట్ల పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలన్నారు. మహిళా సాధికారతను సాధించేందు కు పోలీస్ అధికారులు ముందుకు రావాలని కోరారు. అభిలాష బిత్త ఏపీఎస్ మాట్లాడుతూ కార్యాలయాల్లో మహిళలు ఉద్యోగ విధులను నిర్వహిస్తున్న సమయంలో ఫిర్యాదులకు వచ్చిన వారికి సదుపాయాలని కల్పించాల న్నారు. పాలిస్తున్న తల్లులకు, పసిపిల్లలతో పాటు వారికి మెరుగైన వస్తువులను కల్పించేందుకు కృషి చేయాలన్నారు. వారికి సంరక్షకులుగా నిలిచేందుకు కృషి చేయాలన్నారు. క్రైం నేరాలు ఫిర్యాదులు చట్టపరమైన నిబంధనలు, యాసిడ్ దాడులు, ఒత్తిడి నిర్వహణ, మహిళలపై సున్న క్రైంలు వంటి అంశాలపైన పూర్తిగా అవగాహనుండాల న్నారు. కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు, మహిళా పోలీస్ ఉన్నత అధికారులు, తదితరులు పాల్గొన్నారు