స్టే ఫ్రీ, డ్రీమ్స్ అన్‌ఇంటెరప్టెడ్క్యాం పెయిన్‌తో మహిళలు తమ కలలను సాకారం

– హైదరాబాద్‌లో పి.వి.సింధు మరియు ఆమె అభిమానుల కోసం స్టేఫ్రీ ఒక ఉత్తేజకరమైన సమావేశాన్ని నిర్వహిస్తుంది
నవతెలంగాణ – హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ బహిష్టు పరిశుభ్రత బ్రాండ్‌లలో ఒకటైన స్టేఫ్రీ నేడు, హైదరాబాద్‌లోని రిలయన్స్ రిటైల్ స్టోర్‌లో జరిగిన కార్యక్రమంలో తన బ్రాండ్ అంబాసిడర్, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ పి.వి.సింధు మరియు ఆమె అభిమానులతో అద్భుతమైన మీట్ అండ్ గ్రీట్‌ను నిర్వహించింది. లక్షలాది మంది యువతులకు రోల్ మోడల్, పి.వి.సింధు వినియోగదారులతో కలిసిపోయి మాట్లాడారు. ముఖాముఖి సందర్భంగా, పి.వి.సింధు రుతుస్రావం సమయంలో యువతులు ముఖ్యంగా, మహిళా అథ్లెట్లు ఎదుర్కొనే సవాళ్లు, పీరియడ్స్ సమయంలో కావలసిన నాణ్యమైన నిద్ర అవసరం, రుతు పరిశుభ్రత ప్రాముఖ్యతలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎవరైనా తమ కలను సాకారం చేసుకునేందుకు మొత్తం శారీరక మరియు మానసిక శ్రేయస్సు కోసం రాత్రుళ్లు మంచి నిద్ర ఎటువంటి కీలక పాత్రను పోషిస్తుందో అథ్లెట్‌గా ఆమె తన వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకున్నారు. ఈ నెల ప్రారంభంలో, రిలయెన్స్ రిటెయిల్ భాగస్వామ్యంతో స్టేఫ్రీ DreamsUninterrupted పేరుతో పోటీని నిర్వహించింది. రాత్రంతా లీకేజీ రక్షణను అందించడంలో సహాయపడుతుంది[1] మరియు కలలు అంతరాయం లేకుండా ఉండేలా చూసేందుకు, తన పొడవు, వెడల్పుల వైశాల్యంతో పీరియడ్స్‌లో ఉన్నప్పుడు ఆందోళన-రహిత నిద్రను అందించడంలో స్టేఫ్రీ సెక్యూర్ నైట్స్ ప్రయోజనాన్ని క్యాంపెయిన్ హైలైట్ చేస్తుంది. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారు నగరంలో అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణిని భేటీ అయ్యేందుకు, వారితో ముచ్చటించేందుకు జీవితంలో ఒకసారి మాత్రమే లభించే అవకాశాన్ని దక్కించుకున్నారు. స్టేఫ్రీ బ్రాండ్ అంబాసిడర్ పి.వి.సింధు తన అనుభవాన్ని పంచుకుంటూ, ‘‘అభిమానుల కలలు, ఆకాంక్షలను మరింత తెలుసుకునుందకు నేను ఎల్లప్పుడూ వారితో సన్నిహితంగా ఉండటానికి ఇష్టపడతాను. యువతులు విశ్వాసంతో తమ కలలను సాకారం చేసుకోవడంలో రుతుక్రమ ఆరోగ్య ప్రాముఖ్యతను చర్చించేందుకు నేడు జరిగిన కార్యక్రమం నాకు గొప్ప అవకాశాన్ని అందించింది’’ అని పేర్కొన్నారు.
‘స్టేఫ్రీ ఎల్లప్పుడూ మహిళా సాధికారతకు ఛాంపియన్‌గా ఉంది. పీరియడ్స్ అనేవి మా కలల మార్గంలో అడ్డురావని వివ్వసిస్తుంది. స్టేఫ్రీ సెక్యూర్ నైట్స్‌తో, ఈ ప్రొడక్ట్ రాత్రుళ్లు లీకేజీ నుంచి రక్షణను అందిస్తుంది[2]*. నాలాంటి అమ్మాయిలు మరకల గురించి చింతించకుండా సుఖంగా నిద్రపోయేలా చేస్తుంది” అని ఆమె వివరించారు. కెన్‌వ్యూ మార్కెటింగ్ మరియు ఎసెన్షియల్ హెల్త్ బిజినెస్ యూనిట్ హెడ్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ గాడ్గిల్ మాట్లాడుతూ, “ఒక యువతి, ఆమె పీరియడ్స్ మధ్య ఒక ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచేందుకు, పీరియడ్స్‌తో సంబంధం ఉన్న భయం, అవమానం, అసౌకర్యం లేకుండా ఉంచేందుకు స్టేఫ్రీ ప్రయత్నిస్తోంది. మా తాజా ప్రచారంతో, #DreamsUninterrupted మహిళలు వారి కలలను సాకారం చేసుకునేందుకు, వారికి పీరియడ్స్ సమయంలో దీర్ఘకాలిక రక్షణను అందించడం ద్వారా మేము మా నిబద్ధతను మరింత వృద్ధి చేసుకుంటున్నాము. మా వినియోగదారులకు రోల్ మోడల్, భారతదేశపు గొప్ప సాధకులలో ఒకరైన పి.వి.సింధును కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. అలాగే, పీరియడ్స్ అనేవి వారి విజయ పథంలో అడ్డుపడకుండా, వారిని మరింత ప్రేరేపించేలా సహకారాన్ని అందిస్తున్నాము’’ అని వివరించారు.