మహిళలకు చట్టాలపై అవగాహన అవసరం 

– సీనియర్ సివిల్ జడ్జి రాధికా జశ్వాల్ 
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్ 
విద్యార్థినిలు, మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ రాధిక జైస్వాల్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మనోన్యాయ లీగల్ హెడ్ క్లినిక్ ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినిలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కష్టపడి చదివి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఎవరికైనా న్యాయ సలహాలు కావాలంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంప్రదించాలన్నారు. స్త్రీల హక్కులు, చట్టాలు, బాల్య వివాహాలు, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో), తదితర చట్టాల గురించి వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పలు అంశాల గురించి చర్చించారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు చింతోజ్ భాస్కర్, లీగల్ సేల్ సభ్యులు ఆడెపు వేణు, కుంట శ్రీనివాస్, నర్మెటా రమేష్, కళ్యాణి, ప్రిన్సిపాల్ వనజా కుమారి, కళాశాల అధ్యాపకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.