త్రాగు నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

Women on the road for drinking waterనవతెలంగాణ – రామారెడ్డి
గత మూడు నాలుగు రోజుల నుండి త్రాగునీరు లేకపోవడంతో మండల కేంద్రంలోని 2వ వార్డులో మహిళలు బుధవారం రోడ్ ఎక్కారు. రోడ్డుపై కాలి బిందెలు పెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. గతం మూడు నాలుగు రోజుల నుండి మిషన్ భగీరథ నీరు రావటం లేదని, గ్రామపంచాయతీ బోరు మోటర్ మూడు రోజుల క్రితం చెడిపోవడంతో, గ్రామపంచాయతీ ప్రత్యామ్నాయ మార్గాలను చేపట్టకపోవడంతో నీటి ఇబ్బంది ఏర్పడిందని వారు ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్ ను ఘటనపై వివరణ కోరగా… మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ లతో నీటి సరఫరా అంతరాయం కలిగిందని, గ్రామపంచాయతీ బోరు మోటర్ చెడిపోవడంతో త్రాగునీటికి రెండు రోజులు అంతరాయం కలిగిందని, బుధవారం బోరు మోటారు మరమ్మతు చేసి కాలనీలకు నీరు అందించామని తెలిపారు.