నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామంలో వర్షాలు కురవాలని కోరుతూ గురువారం బస్టాండ్ వద్ద బతుకమ్మ ఆడారు. ఇటీవల కాలంలో ముసురు వర్షం పడినప్పటికీ ఏమాత్రం ప్రభావం లేకపోవడంతో బోరు బావులు వట్టిపోతున్నాయని , వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ మహిళలు బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో మహిళలు భూషబోయిన లింగమ్మ, రాగిరి బాలమ్మ, వడ్డే బోయిన బుచ్చమ్మ, గడసందుల కలమ్మ, వడ్డేపోయిన మల్లమ్మ, పాక ఐలమ్మ, సయ్యద్ కతీజ, భూష బోయిన అండాలు, గడసందుల రేవతి, గడసందుల ప్రమీల, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.