మండలంలోని పస్రా గ్రామంలో అభ్యుదయ కాలనీ మహిళలు బురదమయమైన రహదారిపై వరి నాటు వేసి నిరసన వ్యక్తం చేశారు. శనివారం కాలనీలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ వీధులన్నీ బురదమై ఉన్నాయని, డ్రైనేజీ సౌకర్యం లేకపోవడం వల్ల మురుగునీరుతో దోమలు ఆశించి రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు వరి పొలాల నాట్లను తలపించే పరిస్థితి ఈ విధంగా ఉంది. వర్షాకాలం వచ్చిందంటే చినుకు పడితే అభ్యుదయ కాలనీ చిత్తడే. మా కాలనీ రోడ్ల పరిస్థితి ఈ విధంగా ఉందని. వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నామని అభ్యుదయ కాలనీ వాసులు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా మా కాలనీ రోడ్లన్నీ సిసి రోడ్లు డ్రైనేజీలు వేయించాలని ప్రభుత్వ గ్రామ. మండలాధికారులను మరియు ప్రజా ప్రతినిధులను. అభ్యుదయ కాలనీ వాసులు కోరుకుంటున్నారు. సీపీఐ(ఎం) పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీలలో సిసి రోడ్లు దాదాపు పూర్తి కావచ్చాయని ఒక పసరాలో మాత్రం పాలకవర్గం వైఫల్యం కారణంగా సిసి రోడ్లు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు. దాని పర్యవసానం ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో పనులు చేసే వారికి పట్టం కట్టాలని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు.