మహిళలు అన్ని రంగాల్లో సమానత్వాన్ని సాధించాలి 

– జిల్లా సంక్షేమాధికారిణి సావిత్రి సూచన 
– మహిళ సాధికారత అధ్వర్యంలో విద్యార్థినిలకు అవగాహన 
నవతెలంగాణ – బెజ్జంకి 
పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో సమానత్వాన్ని సాధించాలని జిల్లా  సంక్షేమాధికారిణి సావిత్రి సూచించారు. బుధవారం మండల పరిధిలోని బేగంపేట ప్రభుత్వోన్నత పాఠశాలోని విద్యార్థినిలకు మహిళ సాధికారత అధ్వర్యంలో మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, డయల్ 181,పిల్లల సంరక్షణ రక్షణ డయల్ 1098, అంగన్వాడీ,బాల్య వివాహాలు,చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పౌష్టికాహారంపై గర్భీణీలకు అవగాహన కల్పించారు.ఐసీడీఎస్ సీడీపీఓ జయమ్మ,సూపర్ వైజర్ నాగారాణి,మహిళ సాధికారత జిల్లా కో ఆర్డీనేటర్ వేసవి,లింగ సమానత్వ ప్రత్యేక ప్రతినిధులు పద్మ,లావణ్య,ప్రతిమ సఖి కేంద్రం నిర్వహాకురాలు అమని,పాఠశాల బోధన సిబ్బంది,విద్యార్థినిలు పాల్గొన్నారు.