
ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఐకెపి కమ్యూనిటీ కోఆర్డినేటర్ రవి శనివారం అన్నారు. మండలంలోని తొర్లికొండ గ్రామంలోని సూర్య గ్రామ సంఘ సమావేశం జనరల్ బాడీ సమావేశం శనివారం నిర్వహించారు. జనరల్ బాడీ సమావేశంలో 2023 24 గాను ఆర్థిక లావాదేవీలను కార్యదర్శి చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఐకెపి కమ్యూనిటీ కోఆర్డినేటర్ రవి మాట్లాడుతూ మహిళా శక్తి కార్యక్రమాలను వినియోగించుకొని ప్రతి ఒక్కరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ప్రతి ఒక్కరూ పాడి గేదెలను కొనుగోలు చేసి పాల ఉత్పత్తిని పెంచి దేశ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. అదేవిధంగా నాటు కోళ్ల పెంపకాన్ని చేపట్టి ప్రతి ఒక్కరూ ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నారు. ఫుడ్ ప్రాసెస్ యూనిట్లకు మండల సమైక్య నుంచి తక్కువ వడ్డీ తో రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. స్కూల్ పిల్లల యూనిఫామ్ కుట్టడానికి టైలర్ ఉన్న ప్రతి మహిళ ముందుకు వచ్చి ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని వినియోగించుకొని అన్ని విధాలుగా ఆర్థికంగా ఎదగాలన్నారు. అదేవిధంగా ఆహార శుద్ధి యంత్రాలను కొనుగోలు చేసి రైస్ మిల్లను నూనె మిళ్లను పిండి గిర్నీలను గానుగ మిషిన్లను ఏర్పాటు చేసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీని వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం ప్రతినిధులు అన్ని గ్రామ సంఘాల సభ్యులు వివోఏలు తదితరులు పాల్గొన్నారు.