
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం ఉపాధి తో ఆర్థికంగా అభివృద్ధి చెందాల అన్నదే మా లక్ష్యం అని ఫాదర్ అలెగ్జాండర్ ఫసల్ అన్నారు. బుధవారం మండలంలోని కచలాపురంలో గ్రామంలో గత మూడు నెలలుగా శిక్షణ పొందిన మహిళలకు సబ్సిడీ కింద మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందిన ప్రతి మహిళ పట్టుదలతో ముందుకు పోతే కుటుంబానికి చేయూతగా ఉండవచ్చని మహిళలకు అవగాహన కల్పించారు . ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుర్జ రామచంద్రం, ట్రైనింగ్ మాస్టర్ పసల బ్రాంచెస్ ఎలిజబెత్ , సబిత ,వాణి ,ప్రమీల , వసంత , స్వప్న తదితరులు పాల్గొన్నారు