మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి….

Women should excel in all fields.– వచ్చే ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేస్తాం…
– ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. సంకురాత్రి సంబరాల్లో భాగంగా ఆదివారం అశ్వారావుపేట మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై అయి తొలి ముగ్గు వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఉత్సాహపరుస్తూ స్నేహపూర్వక వాతావరణంలో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అన్నారు.వచ్చే ఏడాది ఇదే కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని నియోజకవర్గ వ్యాప్తంగా ఖర్చుకు వెనకాడకుండా స్వయంగా భరాయించి కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతామన్నారు. అనంతరం జరిగిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో మొదటి బహుమతి రూ.5,116 లు గెలుపొందిన విజేత పి సింధూజ,రెండో బహుమతి రూ.3,116 లు గెలుపొందిన విజేత దూబకుంట్ల సత్యవాణి, మూడో బహుమతి రూ.2,116 లు గెలుపొందిన విజేత చెన్నూరి వరలక్ష్మి లకు, ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు కురిసెట్టి నాగబాబు నాయుడు,గౌరవ అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ, పసుపులేటి రామస్వామి, యూత్ అధ్యక్షులు చిక్కం గోపాలకృష్ణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తిరుమల శెట్టి అప్పారావు, వాసా ఏసుబాబు, కట్టా శ్రీనివాసరావు, కట్ట సుబ్బారావు, సాత్విక్ చిన్నంశెట్టి పవన్ తదితరులు పాల్గొన్నారు.