మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..     

నవతెలంగాణ – ధర్మారం
మండలం లోని నాయకంపల్లి లంబాడి తాండలో  మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం రోజు అవగాహన సదస్సు నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ మాట్లాడుతూ ఆడపిల్లల సంరక్షణ,  మహిళల హక్కులు, అలాగే బేటి బచావో బేటి పడావో యొక్క ముఖ్య ఉద్దేశం వివరిస్తు , అంగన్వాడీ సేవలను, బాల్య వివాహాలను అరికట్టాలని, ఆడపిల్లల పట్ల వివక్షత చూపవద్దని, చైల్డ్ హెల్ప్ లైన్, సఖి సేవలు, సీనియర్ సిటిజన్స్ , పని ప్రదేశాల్లో మహిళల పైన జరుగుతున్న దాడులకు సంబంధించిన చట్టం, ఋతు క్రమం, సైబర్ నేరాలపై, అత్యవసర సమయంలో అవసరమయ్యే హెల్ప్ లైన్ నెంబర్ లపై అవగాహన కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో  అంగన్వాడీ సూపర్వైజర్ బ్లాండిన, టీచర్లు పద్మ, వరలక్మి , ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సుమలత, శ్రీధర్, గ్రామీణ మహిళలు పాల్గొనడం జరిగింది.