‘మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి’

నవతెలంగాణ- సంతోష్‌ నగర్‌
మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత, శశికళ, కవిత, సీఐటీయూ చాంద్రాయన్‌గుట్ట కార్యదర్శి ఎస్‌ కిషన్‌ అన్నారు. ఐద్వా, సీఐటీయూ ఆధ్వర్యంలో చాంద్రాయన్‌గుట్టలోని గౌస్‌ నగర్‌ ఈడబ్ల్యూఎస్‌ కాలనీలో సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివద్ధి కావాలని అన్నారు. అదేవిధంగా ఐద్వా మహిళా సంఘం నిరంతరం మహిళల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహిస్తుందని గుర్తు చేశారు. మహి ళలపై దాడులు, లైంగిక దాడులు జరిగితే ముందుగా స్పందించేది ఐద్వా మహిళా సంఘం అని అన్నారు. మహిళల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం పోటీలో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బస్తీ నాయకులు వెంకటేష్‌, స్వామి, రాజేశ్వరి, జీవన్‌, లతా, మేరీ తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా, డీివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నవతెలంగాణ – ధూల్‌ పేట్‌
ఐద్వా, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గోషామహల్‌ నియోజకవర్గం, జుమ్మెరాత్‌ బజార్‌లోని దేవినగర్‌ బస్తీలో సంక్రాంతి సందర్భంగా శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షు రాలు ఎన్‌.ఆశాలత, ఐద్వా హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా నాయకురాలు పి.శశికళలు పాల్గొని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మహిళలకు అసాధ్యమైనది ఏమి లేదన్నారు. అనంతరం పోటీలో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌.స్వరూప, ఎల్‌.కవిత, ఎ.కష్ణ, బస్తీ నాయకులు జి.హర్సింహ, కే.రాజేశ్వర్‌, కె.గోపి, డీవైఎఫ్‌ఐ మాజీ నాయకులు పి.నాగేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.