
నవతెలంగాణ – నూతనకల్
మహిళలు అన్ని రంగాలలో రాణించి సమాజ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు మాజీ సర్పంచ్ మహేశ్వరం చంద్రకళ అన్నారు. శుక్ర వారం మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆశా వర్కర్ ను ఘనంగా శాల్వాతో సన్మానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చట్టసభలలో స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.