మత్స్య రంగంలో మహిళలు రాణించాలి

– రాష్ట్ర ఫిషరీస్‌ చైర్మెన్‌ పిట్టల రవీందర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మత్స్య రంగంలో మహిళలు రాణించి, స్వయం అభివృద్ధి చెందాలని రాష్ట్ర ఫిషరీస్‌ ఫెడరేషన్‌ చైర్మెన్‌ పిట్టల రవీందర్‌ తెలిపారు. సోమవారం యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామ మహిళ మత్స్యకారుల తో హైదరాబాద్‌లోని మత్స్య భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వయసు గల వారు సభ్యతం నమోదు చేసుకో వాలని సూచించారు . సొసైటీలో చేరిన వారు మిగతావారు చేరేలా ప్రయత్నాలు చేయాలన్నారు. ప్రభు త్వం అన్ని విధాలుగా మహిళా మత్స్య కారులకు కావలసిన సహకారాలు అందజేయడానికి కృషి చేస్తుందన్నారు. ఆరోగ్య పరిరక్షణలో చేపల ఆహారం చాలా కీలకమన్నారు. రాష్ట్రంలో మత్స్య సంపద ఘనంగా పెరిగిందని తెలిపారు. చేపలతో 18 రకాల రోగా లు దరిచేరవని వివరించారు. రాష్ట్రం లోని మహిళా మత్స్య సహకార సంఘాల సభ్యత్వంలో నిరంతర శిక్షణ కొనసాగించడానికి కార్యచరణ ప్రణాళికను రూపొందించినట్టు తెలి పారు. నిరంతరం శిక్షణ కొనసాగిం చేందుకు సుమారు పది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న శిక్షణ కేంద్ర వసతి గృహాలను త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ సేవా సమితి గౌరవ అధ్యక్షులు ఉప్పరి నారాయణ, మత్స్య సహకార సంఘం నాయకులు నూతి చలపతి, గోకారం మండల మత్స్య సహకార సంఘం చీఫ్‌ ప్రాప్రేటర్‌ నూకల స్వాతి, ప్రధాన కార్యదర్శి బుంగపట్ల నాగమణి తదితరులు పాల్గొన్నారు.