• నియోజకవర్గంలో ఉపాధి కల్పన కు పెద్దపీట
• గ్రామీణాభివృద్ధి లో నాబార్డ్, ఎన్జీవోల ది కీలక పాత్ర
• లక్ష్యం స్వచ్ఛంద సంస్థ సేవలు ప్రశంసనీయం
• పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
నవతెలంగాణ-పెద్దవంగర:
రాష్ట్ర ప్రభుత్వం, నాబార్డ్ ప్రోత్సాహకాల తో పాటు, లక్ష్యం స్వచ్ఛంద సంస్థ సహకారాన్ని సద్వినియోగం చేసుకుని, మహిళలు స్వశక్తితో ఆర్థిక స్వావలంబన సాధించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక లో మంగళవారం నాబార్డ్ సహకారంతో సొసైటీ ఫర్ లక్ష్యం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వాల్యూ ఎడిషన్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ బుల్లెట్స్ ఉత్పత్తులు, వినియోగం, మార్కెటింగ్ పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం ఎంపీపీ ఎర్ర సబిత వెంకన్న, నాబార్డ్ ఎంజీఎం చంద్రశేఖర్ తో కలిసి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉపాధి కల్పన కు పెద్దపీట వేస్తామని అన్నారు.
ప్రజలు చిరుధాన్యాలు ఆహారంగా తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. గ్రామీణాభివృద్ధి లో రాష్ట్ర ప్రభుత్వం, నాబార్డ్, ఎన్జీవో సంస్థలు అందిస్తున్న పాత్ర ఎంతో కీలకమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లక్ష్యం స్వచ్ఛంద సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఎన్జీవో సంస్థలకు పూర్తిగా తోడ్పాటు అందిస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయనున్నామని తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను నా దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న 210 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు.
లక్ష్యం సీఈఓ తల్లూరి లత మాట్లాడుతూ.. మిల్లెట్ ఆహార ఉత్పత్తుల తయారీకి నాబార్డ్ అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహారం ప్రాముఖ్యత, వినియోగంపై అవగాహన కల్పిస్తూ, లక్ష్యం సంస్థ ఆధ్వర్యంలో మిల్లెట్ తయారీ పై మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మహిళలు మా శిక్షణ ను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మిల్లెట్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో సైంటిస్ట్ ప్రశాంతి, ఇండియా బ్యాంక్ మేనేజర్ మధు, ఎంపీడీవో వేణుమాధవ్, ఆర్ఐ భూక్యా లష్కర్, వైస్ ఎంపీపీ బొమ్మెరబోయిన కల్పన రాజు యాదవ్, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, యూత్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి ఓరుగంటి సతీష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు గద్దల ఉప్పలయ్య, పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు చిలుక దేవేంద్ర, బెడద మంజూల, చిలుక సంపత్, సీసీ పద్మ, సుధాకర్ ఏఈఓ యశస్విని, చందన తదితరులు పాల్గొన్నారు.