– అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
మహిళ సంఘాలు నిర్వహించే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద మొత్తంలో నిర్వహించి ఆర్థికంగా ఎదగాలని అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. శనివారం హుస్నాబాద్ మండలంలోని పోతారం ఎస్ గ్రామంలోని మహిళా సంఘాలు నిర్వహించే నానో ఓవెన్ బ్యాగ్స్ యూనిట్, పేపర్ ప్లేట్స్ తయారీ యూనిట్, గార్మెంట్స్ యూనిట్ ల ను అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ సందర్శించారు.ఒక్కో యూనిట్ ఏ విధంగా నడుస్తున్నాయని, మార్కెటింగ్ ఏ విధంగా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఇంకా మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని లాభ సాటిగా యూనిట్ లు సాగేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట్ డి ఆర్ డి ఓ జయదేవ్ ఆర్య, అడిషనల్ డిఆర్డిఓ మధుసూదన్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కర్ణాకర్, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, ఏపిఎం జి శ్రీనివాస్ గౌడ్, సీసీలు రవీందర్, అశోక్ పాల్గొన్నారు.
పర్యటక కేంద్ర ఏర్పాట్లను పరిశీలిన
మహమ్మదాపూర్ గ్రామంలోని మహాసముద్రం గండిని పర్యటక కేంద్రంగా చేస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ సందర్శించారు. స్థానికులు, ప్రజాప్రతినిధులతో కలిసి మాహ సముద్రం గండిని పరిశీలించి వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పీసీసీ సభ్యులు కేడం లింగమూర్తి, సింగల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు తదితరులు పాల్గొన్నారు.