మహిళలు పురుషులతో సమానంగా ఎదగాలి: ఆశోక్ గౌడ్

నవతెలంగాణ – జుక్కల్

మహిళలు అన్నిరంగాలలో పురుషులతో సమానంగా ఎదగాలని హంగర్గ గ్రామ పంచాయతి కార్యదర్శి ఆశోక్ గౌడ్ అన్నారు. గురువారం నాడు జీపీ భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా గ్రామములోని రెండు అంగన్ వాడి కేంద్రాల మహిళ టీచర్లకు సన్మానల కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా అంగన్ వాడి టీచర్లు జయశ్రీ, కాలీందబాయి, తో పాటు ఆయాలను జీపీ కార్యదర్శి ఆశోక్ గౌడ్  శాలువాతో సన్మానించి ఙ్ఞాపికను అందించారు. అనంతరం మాట్లాడుతు మహిళలు సమాజంలో గౌరవప్రదమైన విధులు నిర్వహిస్తు దేశానికే ఆదర్శంగా అన్ని రంగాలలో  ఎదగాలని జీపి సెక్రట్రి అన్నారు.ఈ కార్యక్రమంలో  జీపీ కార్యదర్శి, అంగన్ వాడి టీచర్లు, ఆయాలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గోన్నారు.