మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

– పంపాల మురళి ములుగు జిల్లా మాదిగ జేఏసీ అధ్యక్షుడు
నవతెలంగాణ – గోవిందరావుపేట
మహిళలు ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రంగాల్లో పోటీ తత్వాన్ని ఎదుర్కొని ముందుండాలని మాదిగ జేఏసీ ములుగు జిల్లా అధ్యక్షుడు అంబాల మురళి అన్నారు. శుక్రవారం మండలంలోని పసర దళితవాడలో 111వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మాదిగ జె.ఎ.సి ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాదిగ జె.ఎ.సి  ములుగు జిల్లా అధ్యక్షులు అంబాల మురళి హాజరయ్యారు ,ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ  మహిళా లోకానికి అంతర్జాతీయ  మహిళా దినోత్సవ శుభాకాంక్ష లు తెలిపారు,అదే విధంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో లింగ వివక్షత కొనసాగుతుందని మహిళ లు వివక్షత కు గురవుతున్నారని మండిపడ్డారు, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు మహిళ ల్లో సరైన విద్య లేక పోవడం వలనే  సమాజంలో వివక్షత కు గురవుతున్నారని ఆయన అన్నారు మహిళల పై అనేక సార్లు దాడులు చేసి  హత్య , అత్యాచారాలు జరిగిన ఘటనలు ఉన్నాయి, గుజరాత్ ,మణిపూర్, ఉత్తర్ ప్రదేశ్ ఇంకా అనేక రాష్ట్రాల్లో మహిళల పై హత్య,హత్యాచారాలు వంటి దాడులు జరిగినప్పటికి  మహిళల కు సరియైన న్యాయం ఈ పాలక ప్రభుత్వాల ద్వారా అందడం లేదని , కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు గా వ్యవహరిస్తున్నాయని మురళి మండిపడ్డారు,ఈ రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా మహిళల పక్షాన నిలబడి  మాదిగ జె.ఎ.సి  న్యాయం జరిగే వరకు పోరాడుతుందని,అండగా ఉంటుందని మురళి తెలిపారు. మహిళలు చైతన్యం కావాలని పురుషులతో సమాన పని చేస్తున్న   మహిళలకు సమాన వేతనం సమాన హక్కులు కావాలని  సమాజంలో స్వేచ్ఛా స్వాతంత్ర్యం  ,భద్రత,భరోసా  కలిగి ఉన్నపుడే మహిళలు  స్వేచ్ఛ  గా జీవిస్తారని అన్నారు,మహిళలందరు ఐకమత్యంతో తమ హక్కులను పోరాడి సాదించు కోవాలని ఆయన కోరారు.