
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని మహిళా సాధికారత కేంద్ర సిబ్బంది సౌందర్య తెలిపారు. శుక్రవారం మండలంలోని అంగన్వాడి కేంద్రాలలో మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే విధంగా మహిళకు తనకంటూ ఒక ఉపాధి కల్పించుకునే విధంగా ఎదగాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మహిళలు ముఖ్యంగా మగ్గం, బ్యూటీషియన్, టైలరింగ్ కోర్సులు ఉచితంగా నేర్చుకునే అవకాశం ఉందని, ఆహార పదార్థాల తయారీ చేసే పద్ధతులు వివరించారు. ప్రభుత్వ హెల్ప్ లైన్ సదుపాయాల్లో సఖి సర్వీసెస్ 181 హెల్ప్ లైన్ నెంబర్ సదుపాయం, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930, చిల్డ్రన్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 సదుపాయాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.