మహిళలు అన్ని రంగాల్లో చైతన్యంతో ముందుకు సాగాలని చెర్క జగన్నాథం మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ పబ్బు నారాయణ, ట్రస్ట్ సభ్యులు మద్దెల రాజయ్య లు అన్నారు. మండల పరిధిలోని గోకారం గ్రామంలో చెర్క జగన్నాథం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సంక్రాంతి పండగ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించి పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలను వంట ఇంటికే పరిమితం చేస్తూ వివక్ష చూపుతున్నారని, పురుషుడితో సమానమైన విలువ ఇవ్వడం లేదని, సమాజంలో మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. మహిళలలో దాగి ఉన్న సృజనత్మాకతను, కళ నైపుణ్యం వెలికి తీయడం కోసం ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ పోటీలో సుమారు ఐదు వందల మంది పాల్గొని వారి ప్రతిభను కనబరిచారన్నారు. మొదటి, ధ్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న వారందరికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలోసర్పంచ్ తుర్కపల్లి మాధవి సురేందర్,ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చెర్క ఉమేష్, వైస్ చైర్మన్ చెర్క వెంకటేష్, కోశాధికారి కవిడే సురేష్, కార్యదర్శి దేశపాక బాబు, పబ్బు యాదగిరి, నారి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.