సమాజంలో మహిళలు పట్టుదలతో శ్రమించి అన్ని రంగాలలో రాణించాలని జి ఎస్ ఎస్ సి జిల్లా కన్వీనర్ కూకుట్ల శివాణి ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి వనం రాజు అన్నారు. గురువారం భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అన్ని రంగాలలో మహిళలు రాణించాలనీ , చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలలో ముందుండాలని వారు కోరారు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే నేటి మహిళలకు ఆదర్శమని అన్నారు.మహిళలు సమాజంలో వస్తున్న రుగ్మతల పైన చైతన్యం పెంచుకొని ప్రశ్నించాలని అన్నారు. విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యం వైపు ప్రయాణించాలని కోరారు. విద్యార్థులంతా అన్వేషణ వైపు ఆలోచనను మలుచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చింతల శివ, పట్టణ అధ్యక్షులు ఈర్ల రాహుల్, పట్టణ నాయకులు ఏడుమేకల మహేష్, నక్క చింటూ, ఇందూ రాణి, మౌనిక ,హారిక ,మేఘన, సోనియా, సానియా ,ఉదయ్ రాణి వైష్ణవి ,సౌజన్య, శ్రీలేఖ ,ప్రేమజ పాల్గొన్నారు.