మహిళలు ‘పొదుపు’ ను అలవర్చుకోవాలి 

Women should practice 'saving'– డీపీఎం లు గడ్డం శ్రీనివాస్, చంద్రశేఖర్ 
నవతెలంగాణ – పెద్దవంగర
మహిళలు పొదుపు ను అలవర్చుకుని, ఆర్థికంగా స్థిరపడాలని డీపీఎం లు గడ్డం శ్రీనివాస్, చంద్రశేఖర్, శ్రీనిధి ఆర్ఎం మధు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో శ్రీ తులసి మండల సమాఖ్య 8 వ వార్షికోత్సవాన్ని అధ్యక్షురాలు దంతాలపల్లి రేణుక అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వారు మాట్లాడుతూ.. ఎన్పీఏ బకాయిలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని, మహిళలకు రక్తహీనత లేకుండా పౌష్టిక ఆహారం తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా ఎస్ హెచ్ జి మరియు వివో మీటింగులు ఏర్పాటు చేసి, మండలంలోని అన్ని వీవోలు ఏ గ్రేడ్ లో ఉండే విధంగా సిబ్బంది పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఏపీఎం రమణాచారి, సీసీ లు జి. సుధాకర్, ఎస్. సుజాత, ఎం. పద్మమ్మ, బి. సుధాకర్, ఎమ్మెస్ కార్యదర్శి భద్రమ్మ, ఎమ్మెస్ కోశాధికారి స్వాతి, ఎం ఎస్ ఏ ఆశాలత. ఆపరేటర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.