హౌటళ్లలో మహిళలు, పిల్లల భద్రతపై శ్రద్ధ వహించాలి

– మహిళా భద్రతా విభాగం డీజీపీ షికా గోయెల్‌
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలోని వివిధ స్థాయి హౌటళ్లలో మహిళలు, పిల్లల భద్రత పట్ల యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలనీ, అందుకు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం డీజీపీ షికా గోయెల్‌ స్పష్టం చేశారు. సోమవారం వివిధస్థాయి హౌటళ్ల యాజమాన్యాలు, వాటి జనరల్‌ మేనేజర్లతో షికా గోయెల్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా, హౌటళ్లకు వచ్చే మహిళలు, చిన్నపిల్లలకు సంబంధించి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. హౌటళ్లకు వచ్చేవారి గుర్తింపు కార్డులను ప్రత్యేకంగా పరిశీలించాలనీ, వాటిని రికార్డులలో నమోదు చేయాలని తెలిపారు.