
నవతెలంగాణ – ముత్తారం
రాణి రుద్రమ, ఝాన్సీ లక్ష్మి బాయి లాంటి వీర వనితలను మహిళలు వీర వనితలను ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీటీసీ దొడ్డ గీతా రాణి బాలాజీ అన్నారు. ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను రక్షణ సోషల్ సర్వీస్ సొసైటీ లింగామల్ల రమాదేవి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అడవి శ్రీరాంపూర్ ఎంపీటీసీ దొడ్డ గీతా రాణి బాలాజీ మాట్లాడుతూ మహిళా వంటింట్లో పరిమితం కాకుండా అన్ని రంగాలలో ముందుడాలని అన్నారు. సమావేశంలో ముఖ్యఅతిథిలుగా మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు బందెల యాధలక్ష్మీ, స్త్రీ శక్తి ఎంటర్ ప్రైజెస్ అధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ రక్షణ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో స్త్రీ శక్తి ఎంటర్ప్రిజేస్ వారి సౌజన్యంతో ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం ఎంపీటీసీ దొడ్డ గీతా రాణి బాలాజీ, ముత్తారం సర్పంచ్ తూటి రజిత రఫీని, అంగన్వాడీ టీచర్స్ బద్రి రమాదేవిని, మంథని తిరుమలని శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎస్సి ఎస్ టి రాష్ట్ర నాయకుడు పిఆర్ నెల్సన్, మల్లారం మండల మహిళా అధ్యక్షురాలు పంతకాని చంద్రకళ, పీక కిరణ్, ఏకు సతీష్, ములుగు ప్రేమ్ కుమార్, మంథని రాజు, విజయ్, విశాల్, సందీప్, మడిపెల్లి దేవేందర్ తదితరులున్నారు.