నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మహిళా శక్తి కార్యక్రమాలు వినియోగించుకోవడం ఐకెపి ఎపిఎం రవీందర్ రెడ్డి గురువారం అన్నారు. మండల కేంద్రంలోని గురుడు కాపు సంఘంలో మండల కేంద్రంలోని ప్రగతి మహిళా గ్రామ సంఘం జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా గ్రామ సంఘం కార్యదర్శి 2023 24 హార్దిక సంవత్సరం లావాదేవీలను చదివి వినిపించారు. అనంతరం కార్యవర్గ సభ్యులు ఎన్నుకొని గ్రామ సంఘం ప్రతినిధులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐకెపిఎపిఎమ్ రవీందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమాలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు పాడి గేదెలను నాటు కోళ్లను పెంచుకొని అదనపు ఆదాయం చేకూర్చుకోవాలన్నారు. బ్యాంకు రుణాలు, శ్రీనిధి రుణాలు వినియోగించుకుని ఆర్థిక అభివృద్ధిని చేపట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్ రాములు దశరథ్ వీవోఏలు అన్ని సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు