తెలంగాణ యూనివర్సిటీ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మినీ సెమినార్ హాల్లో శుక్రవారం ఉమెన్స్ సెల్ డైరెక్టర్ డాక్టర్ భ్రమరాంబిక అధ్యక్షతన ఉమెన్ టీచర్స్ డే ఉత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ ఆరతి పాల్గొని మాట్లాడుతూ .. 19వ శతాబ్దం పూర్వార్ధంలోనే మహిళా విద్య ప్రాధాన్యతను గుర్తించి విద్య విస్తరించడం కోసం కృషి చేసిన వారిలో సావిత్రిబాయి పూలే మొదటి సామాజిక విప్లవ కారిని అని కొనియాడారు.మహిళలు విద్యారంగంలో ముందుంటే ఆ సమాజం శాస్త్రీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుంటుందని సావిత్రి బాయి పూలే మహిళా విద్యాలయాలు ప్రారంభించారని కొని ఆడారు.ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ లావణ్య మాట్లాడుతూ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్ డేగ ప్రకటించడం ఆనందకరమైన విషయమని తెలిపారు. ఈ క్రమంలో సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను నేర్చుకోవాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ టి యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి మహిళా అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు కైసర్ మహమ్మద్, డాక్టర్ నందిని, డాక్టర్ స్రవంతి, డాక్టర్ శాంతాబాయి, డాక్టర్ పార్వతి, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ సమత, డాక్టర్ గుల్ ఏ రానా, సూపరింటెండెంట్ ఉమారాణి, బోధన బోధనేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.