– తొలి దశలో 16 స్థానాల్లో ఆధిపత్యం
ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు గేమ్ ఛేంజర్ అని నిరూపించుకుంటున్నారు. ఇక్కడ తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 20 నియోజకవర్గాల్లో 16 స్థానాల్లో మహిళలే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఈ స్థానాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. 90 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. తొలి దశలో 20 స్థానాలకు పోలింగ్ జరగగా, రెండో దశలో 70 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
మొదటి దశలో 20 స్థానాల్లో 19,93,937 మంది పురుష ఓటర్లు, 20,84,675 మంది మహిళా ఓటర్లు, 69 మంది థర్డ్ జెండర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి దశలో మొత్తం 40,78,681 మంది ఓటర్లున్నారు. 20 నియోజకవర్గాల్లో 16 నియోజకవర్గాలు మోహ్లా-మన్‌పూర్, భానుప్రతాపూర్, కంకేర్, కేష్‌కల్, కొండగావ్, నారాయణపూర్, దంతేవాడ, బీజాపూర్, కొంటా, రాజ్‌నంద్‌గావ్, ఖుజ్జీ, పండరియా, కవార్ధా, బస్తర్, జగదల్‌పూర్, చిత్రకోటేపూర్‌లు ఉన్నాయి. భారతదేశంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ.వీటిలో అత్యధికంగా మహిళా ఓటర్లు కవార్ధా సీటులో ఉన్నారని అధికారులు తెలిపారు. కవార్ధాలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,31,615. వీరిలో 1,66,843 మంది మహిళలు, 1,64,770 మంది పురుషులు ఉన్నారు. కాగా థర్డ్ జెండర్ ఇద్దరు ఓటర్లు ఉన్నారు. తొలి విడతలో మిగిలిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలైన అంతఘర్, డొంగర్‌ఘర్, ఖైరాఘర్, డొంగర్‌గావ్‌లలో మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లే ఎక్కువగా ఉన్నారని చెప్పారు.
25 మంది మహిళలు పోటీ
తొలి దశలో 25 మంది మహిళలు సహా 223 మంది అభ్యర్థులు బరిలో దిగారు. తొలి విడతగా 5,304 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. వీటిలో 200 పోలింగ్ కేంద్రాలు ‘సంగ్వారీ’ పోలింగ్ కేంద్రాలను మహిళా సిబ్బంది నిర్వహించటం గమనార్హం.మొదటి దశలో, థర్డ్ జెండర్ 69 మంది ఓటర్లలో, గరిష్టంగా 29 మంది ఓటర్లు జగదల్‌పూర్, అంతగఢ్ , బీజాపూర్‌లలో ఎనిమిది మంది, డొంగర్‌ఘర్ , నారాయణపూర్‌లలో నలుగురు, కేష్‌కల్, కవార్ధా, రాజ్‌నంద్‌గావ్, కాంకేర్, కొండగావ్ , బస్తర్‌లో ఇద్దరు, చిత్రకోట్, దంతెవాడ, కొంటలో ఒక్కొక్కరు చొప్పున ఓటర్లు తమ ఓట్లను వేశారు. కాంకేర్ జిల్లాలోని అంతఘర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం 8 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ప్రత్యేకంగా సిద్ధం చేసిన ‘రెయిన్‌బో’ మోడల్ పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేసుకునే అవకాశం కల్పించారు.