కీలకం కానున్న మహిళ ఓటర్లు 

– దుబ్బాకలో పురుషులకంటే 4054 మంది మహిళ ఓటర్లు ఎక్కువ
నవ తెలంగాణ – సిద్దిపేట
నవంబర్ 30న జరిగే సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో జిల్లాలో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో పురుషులకంటే అధికంగా మహిళా ఓటర్ల నమోదు ఎక్కువగా ఉంది. అత్యధికంగా దుబ్బాకలో పురుషుల కంటే 4054 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అన్ని రంగాలలో నేడు తమ సత్తాను చాటుతున్న మహిళలు,  ఈ ఎన్నికల్లో తమ ఓటు ప్రభావం చేత ఏ పార్టీ… ఏ నాయకుని వైపు ఉంటుందో వారు గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 9,25,398 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 4,68,140 మంది మహిళా ఓటర్ల ఉండగా, 4,57,178 మంది పురుష ఓటర్లు లో ఉన్నారు. 80 మంది ఇతరులు ఓటరుగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 10,962 మంది మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లు
సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గం ఉన్నాయి. అక్టోబర్ మొదటివారం నాటికి ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఓటర్ల సంఖ్య 9, 25, 398 నమోదయి ఉన్నారు. నియోజకవర్గాల వారీగా…
32-హుస్నాబాద్ – 117165(పు)- 119406(మ)- 4(ఇ)- మొత్తం 2,36,575. కాగా 2241 మంది మహిళ ఓటరు ఎక్కువగా ఉన్నారు.
33-సిద్దిపేటలో – 112934(పు)- 115520(మ)- 69(ఇ)- మొత్తం 2,28, 523. కాగా2586 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
41 – దుబ్బాకలో – 95305(పు)- 99359(మ)- 0(ఇ)-  మొత్తం 1,94,664 . కాగా 4054 మంది మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
42-గజ్వేల్ లో – 131774(పు) – 133855(మ)- 7(ఇ)- మొత్తం 2,65,636. కాగా 2081 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
నియోజకవర్గం వారీగా చూసుకుంటే దుబ్బాక నియోజకవర్గం లో అత్యధికంగా మహిళ ఓటర్లు ఉన్నారు.  ప్రతి నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే అధికంగా ఉండడంతో,  ఎన్నికలలో పోటీ చేసే నాయకులు మహిళలను ఆకట్టుకునే విధంగా తమ ప్రచారాలను కొనసాగిస్తేనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.