– మియాపూర్ భూముల్లోనే తిష్ట
– ఓ వర్గం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన
– భూముల్లోకి మరో వర్గం ఘటనా స్థలానికి అధికారులు
– భూ కబ్జాదారులకు నచ్చజెప్పే యత్నం
– అధికారులపైకి రాళ్లు రువ్విన ప్రజలు
– ఓ అధికారికి గాయం, ఆటో ధ్వంసం
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్
రంగారెడ్డి జిల్లా మియాపూర్ భూముల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హెచ్‌ఎండీఏ పరిధి లోని వందలాది ఎకరాల భూములలో కొంత కాలంగా ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు గుడిసెలు వేసుకుం టున్నారు. వందలాది మంది ఇక్కడికి తరలివచ్చి హడా వుడి చేస్తున్నారు. శుక్రవారం నాటికి ఈ వ్యవహారం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటి వరకు పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలంటూ ఓ మహిళ ఆధ్వర్యంలో మహిళలు పోరాటం చేస్తుండగా, ఇప్పుడు అదే స్థలాల మీదకు మ రో మహిళ తన అనుచరులతో ఎంటర్ అయింది. ఆటో లలో వేలాదిగా తరలివచ్చిన వారు మియాపూర్ 100, 101లలోని భూములలో ఎవరికి వారు తాళ్లు కట్టి, చీరలతో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు.
స్థలాల కోసం పోరాటం చేస్తున్న మహిళలు దీప ి్తశ్రీనగర్ నగర్ నుంచి శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యా లయం వరకు వేలాదిమంది మహిళలతో ర్యాలీ నిర్వహిం చారు. తమకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇటు మరో మహిళ నేతృత్వంలో ప్రజలు మియాపూర్ భూముల్లో హల్‌చల్ చేశారు. ఏకంగా ఓ గుడి కట్టేసి ఇదంతా తమ స్థలమే అంటే నినాదాలు చేస్తూ నానా హంగామా చేశారు. ఓ వైపు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈ ఆందోళన జరుగుతున్న సమయంలోనే మియా పూర్ భూముల్లో మరోవర్గం భూ ఆక్రమణలకు తెరలేపడం పోలీసులకు తలనొప్పిగా మారింది. వారిని వారించేందుకు అక్కడి పోలీసులు వెళ్లినా ఏమీ చేయలేని పరిస్థితి. శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఒకానొక దశలో కబ్జాదారులు పోలీసుల మీదకు తిరగబడ్డారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు, రెవెన్యూ, హెచ్‌ఎండీ ఏ సిబ్బంది ఆందోళన కారులతో చర్చించేందుకు, వారిని శాంతిపజేసేందుకు ప్రయత్నించారు. అయినా ప్రయో జనం లేకుండా పోయింది. కబ్జాదారులు చెట్ల పొదల్లోకి వెళ్లి అక్కడే ఉంటూ హడావుడి చేశారు. అర్ధరాత్రి అయినా కబ్జాదారులు వెనక్కి తగ్గకుండా రాత్రి కూడా అక్కడే ఉన్నారు. శనివారం ఉదయం రెవెన్యూ, పోలీసు, హెచ్‌ఎండీఏ అధికారులు మరోసారి భూ కబ్జాదారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసేందుకు యత్నించిన కబ్జాదారులు వెనక్కి తగ్గలేదు.
కొద్దిసేపు ఉద్రిక్తత
మియాపూర్‌లో పోలీసులు, ఆక్రమణదారుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఏసీపీ నర్సిం హారావు, సీఐ, పోలీసులు అధికారులు వచ్చి ప్రజలకు నచ్చజెప్పి సగం మందిని అక్కడి నుంచి పంపించారు. మరికొంత మంది మొండిగా అక్కడే బైఠాయించారు. సాయంత్రం సమయంలో పోలీసులు, ఆక్రమణదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు బందోబస్తు పెంచి జనాలను ఇక్కడి నుంచి చదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఆక్రమణదారులలో కొంత మంది వ్యక్తులు వెనక నుంచి పోలీసులపైకి రాళ్లువిసిరారు. దీంతో పోలీసులు కొంతదూరం ఘటన స్థలం నుంచి పరుగుల తీశారు. ఈ ఘటనలో హెచ్‌ఎండీఓ సైట్ అదికారికి రఘుకి గాయమైంది. పోలీసులు అనౌన్స్ చేసేం దుకు తీసుకు వచ్చిన ఆటో అద్దాలను పగులగొ ట్టారు. పోలీసులు జనాలను చదరగొడుతున్న మరో వైపు నుంచి అక్కడికి చేరుకొని బైఠాయిస్తున్నారు. విషయం తెలుసు కున్న మాదాపూర్ డీసీపీ వినీత్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రజలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. వారు ఉంటున్న ప్రాంతాలలో దరఖాస్తులు చేసుకోవాల ని, అర్హులైన వారందరికీ ప్రభుత్వం ఇండ్లు ఇస్తుందని తెలిపారు. అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపో వాలని కోరగా.. కొందరు వెళ్లి పోయారు. మరికొందరు అక్కడే ఉండిపోయారు.