క్యాన్సర్ వ్యాధిపై మహిళలకు అవగాహన..

నవతెలంగాణ- బెజ్జంకి

మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలోని గోకులం పంక్షన్ హాల్ యందు బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ అధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. బెజ్జంకి, కోహెడ, చిన్నకోడూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, ఇల్లంతకుంట మండలాల మహిళలు అవగాహన సదస్సుకు హజరవ్వగా డాక్టర్ వినోద్ బాబ్జీ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ బాలవికాస ప్రతినిధులు అన్నామేరీ, సుజాత తదితరులు పాల్గొన్నారు.