గుంటూరు : అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా శుక్రవారం గుంటూరులోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ ఆఫీసులో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రీజినల్ మేనేజర్ జయ మందపే, స్థానిక శాఖల ఉద్యోగులు హాజరయ్యారు.ఈ సందర్బంగా మహిళల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ నీరెన్ రావెల వివరించారు. మహిళ సాధికారితపై అడ్వకేట్ పద్మజా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ ఎం శేషగిరి రావు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.