కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు

– సిరిసిల్లలో మహిళా దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు.  కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులను శాలువాతో సన్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా 4 గ్యారెంటీ పథకాలు అమలు కావడంలో ప్రతి ఒక్క మహిళ చాలా సంతోషంగా ఉన్నారు. 200 యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీ మరియు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్య శ్రీ పథకం 10 లక్షల వరకు రూ.500 రూపాయల సిలిండర్  ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సందర్భంగా మహిళలందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞత చెప్పాలని వారు పేర్కొన్నారు.  మహిళల పైన అత్యాచారాలు  జరిగినాబీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని వారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత టౌన్ అధ్యక్షరాలు వేల్ముల స్వరూప సీనియర్ నాయకురాలు మడుపు శ్రీదేవి  ఆడెపు చంద్రకళ తంగళ్ళపల్లి మండలం  అధ్యక్షురాలు హారిక రెడ్డి ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షురాలు లత  బ్లాక్ ప్రెసిడెంట్ రమాదేవి  సిరిసిల్ల టౌన్ జనరల్ సెక్రెటరీ అరుణ  మరియు వార్డు అధ్యక్షులు వేములవాడ కమిటీ మెంబర్స్ మరియు అన్ని మండలాల గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.