ఎస్‌బిఐలో మహిళ దినోత్సవ వేడుకలు

ఎస్‌బిఐలో మహిళ దినోత్సవ వేడుకలుహైదరాబాద్‌ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) లోకల్‌ హెడ్‌ ఆఫీసు హైదరాబాద్‌లో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వివిధ రంగాల్లో రాణించిన మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఇ హైదరాబాద్‌ డైరెక్టర్‌ జనరల్‌ సుంచు గ్లోరి స్వరూప, పైలట్‌ పరుల్‌ భరద్వాజ్‌, మెడికల్‌ అంకాలజీ డాక్టర్‌ సుధా సిన్హా, సామాజిక కార్యకర్త పొట్లబతిని పద్మావతి, ఎస్‌బిఐ లేడిస్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ రష్మీ సిన్హా తదితరులను సత్కరించారు. కేర్‌ హాస్పిటల్‌ సహకారంతో మహిళ సిబ్బంది, హౌజ్‌ కీపింగ్‌ వారి కోసం ఉచిత మెగా హెల్త్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఎస్‌బిఐ సిజిఎం రాజేష్‌ కుమార్‌ అభినందించారు. మహిళలు అనేక రంగాల్లో స్పూర్తిగా ఉన్నారన్నారు.