ప్రాథమికోన్నత పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – తొగుట
ప్రాథమికోన్నత పాఠశాలలొ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం పెద్ద మసాన్ పల్లి ప్రాథమిక పాఠశాల లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠ శాలలో పనిచేసే ఉపాధ్యాయునిలు కవిత, శ్రీలత, మమత, భాగ్యలక్ష్మి, విద్యార్థులకు భోజనాలు అందించే మధ్యాహ్నం భోజనం కార్మికులు నరస మ్మ, కిష్టమ్మ, రమణమ్మ, భారతమ్మ లను శాలువా లతో సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధా నోపాధ్యాయులు జి రాజు, ఉపాధ్యాయులు శ్రీని వాస్ రెడ్డి, దుర్గా రెడ్డి, శ్రీకాంత్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.