నవతెలంగాణ – రెంజల్
సమాజంలో నేడు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళల విషయంలో చిన్న చూపు చూడరాదని జెడ్పీటీసీ మేక విజయ సంతోష్ స్పష్టం చేశారు. గురువారం రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు తమ సమస్యలను సమాజంలో ధైర్యంగా ఎదుర్కోవాలని, రాజకీయాలలో, ఉద్యోగాలలో నేడు మహిళలు పోటీపడుతూ సమాజంలో ముందుకు సాగుతున్నారని ఆమె పేర్కొన్నారు. భారత్ సమాజంలో మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉందని దానిని కాపాడుకొని ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. గర్భిణీ బాలింతలు పౌష్టిక ఆరని తీసుకొని ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనివ్వాలని హామీ పేర్కొన్నారు. గర్భిణీ బలింతలు ఎక్కువగా ఆకుకూరలు కాయగూరలను తీసుకోవాలన్నారు. మహిళా హక్కులు, బాధ్యతల గురించి ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి వివరించారు. అనంతరం ఇద్దరు గర్భిణీ మహిళలకు సీమంతలు చేశారు. ప్రభుత్వం అందించే టోల్ ఫ్రీ నెంబర్లపై ప్రతి ఒక్క రికి అవగాహన ఉండాలని సూపర్వైజర్ ప్రమీల రాణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ గౌసుద్దీన్, మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు, సూపరిండెంట్ శ్రీనివాస్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి రవీందర్, అంగన్వాడి కార్యకర్తలు సుజాత, సురేఖ, పద్మ, రజిత ,సుజాత, రాజ్యలక్ష్మి, రాధిక, రాజశ్రీ , అరుణ, విజయలక్ష్మి పూజ,తదితరులు పాల్గొన్నారు.