ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – కంటేశ్వర్
జర్నలిజం లో మహిళల పాత్ర ఎంతో కీలకమైందని నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ అన్నారు. మీడియా రంగంలో పురుషుల తో సమానంగా  మహిళా జర్నలిస్టులు కూడా నేడు పోటీ పడుతుండటం విశేషమని ఆమె కొనియాడారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథులుగా మేయర్ నీతూ కిరణ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి హాజరయ్యారు.మహిళా జర్నలిస్టుల తో కలిసి క్యారం ఆడారు.వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టులు యాంకర్లు సబ్ ఎడిటర్లను ఘనంగా సన్మానించారు.మహిళా జర్నలిస్టుల ఆధ్వర్యంలో అతిథులను సన్మానించారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇతర వృత్తులతో పోలిస్తే మీడియా రంగం లో మహిళలు పనిచేయడం వార్తా సేకరణలో పోటీపడటం ఎంతో కష్టమని మేయర్ నీతూ కిరణ్  అన్నారు.. ఎంతో మంది శ్రమిస్తేనే ఒక వార్త ఒక కథనం ప్రజల్లోకి వెళ్తుందని వివరించారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు మీడియా రంగంలోనూ రాణించాలని మేయర్ పిలువునిచ్చారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలన్నారు. నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేది ఒక్క మీడియా తోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు.కులం కంటే కలం గొప్పదని జర్నలిస్టులు రాసే ప్రతివార్త సమాజానికి ఒక మంచి సందేశంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ- శేఖర్
కోశాధికారి సందీప్ -నిర్వహణ కార్యదర్శి మోహన్,కమిటీ ప్రతినిధులు గోవింద్ రాజు ప్రమోద్ గౌడ్ ప్రసాద్,రవి చరణ్, సుదర్శన్,ప్రీతం, అహ్మద్ పూర్వ అధ్యక్షలు గంగదాస్ రాజేష్ సీనియర్ జర్నలిస్టులు శ్రీకాంత్ పిటి శ్రీనివాస్,రాజేష్ . జగన్, భూమేష్, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
సన్మానం అందుకున్న మహిళా జర్నలిస్టులు
సంగీత                 24×7
లావణ్య                GTPL
శ్రీవాని                ఇందూరు నేత్రం
అనిత                 నవతెలంగాణ
అర్చన                K6
సంధ్య                K6
సలేహ              ఉర్దూ రోష్ని
వాని                K6
సోనీ               భారతి డిజిటల్
తులసి             సిటీ కేబుల్
ఆస్రా              అప్నా ఉర్దూ