– జీటీఏ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు సన్మానం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ పాఠశాల ఉన్నత పాఠశాలలో మహిళ ఉపాధ్యాయులను జిటిఏ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహ, ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడుతూ మహిళలను గౌరవించిన చోట సుఖశాంతులు విరాజిల్లుతాయని తెలిపారు. సమాజ నిర్మాణంలో వారి పాత్ర కీలకమన్నారు. కేవలం గహిణిగానే పరిమితం కాకుండా నేడు అన్ని రంగాల్లో మహిళలు అగ్రస్థానంలో నిలుస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం సరిత, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివ కుమార్, సత్తారావు, నరసింహారావు, ఘాజీ రామ్ తదితరులు ఉన్నారు.